ఏపీలో బలపడటం ఇక సాధ్యం కాదా?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత దూకుడు పెంచారు. ఇటు [more]
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత దూకుడు పెంచారు. ఇటు [more]
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత దూకుడు పెంచారు. ఇటు టీడీపీని, అటు వైసీపీని టార్గెట్ చేస్తూ బీజేపీని ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు జనసేనతో పాత్తు కూడా తమకు వచ్చే ఎన్నికల్లో కలసి వస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీని ఇబ్బంది పాలు చేస్తున్నాయి.
ప్రత్యేక హోదా అంశం…..
గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం బాగా పనిచేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని చెప్పడంతో గత ఎన్నికలలో బీజేపీని ప్రజలు పట్టించుకోలేదు. నోటా కంటే తక్కువ ఓట్లు రావడం బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితి ఉందో చెప్పకనే తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టుతో….
అయితే ప్రత్యేక హోదాకు మాత్రమే కేంద్ర నాయకత్వం పరిమితం కాలేదు. పోలవరం ప్రాజెక్టులో నిధుల కోత కూడా రాష్ట్ర బీజేపీ నేతలను ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ కంటే బీజేపీనే ఏపీ ప్రజలు ఇప్పడు దోషిగా చూస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను పదే పదే తప్పుతూ ఏపీపై బీజేపీ కేంద్ర నాయకత్వం వివక్ష చూపుతుందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుంది. కేంద్ర నాయకత్వం నిర్ణయాలకు ఆ పార్టీ మిత్రపక్షమైన జనసేన కూడా బలి కావాల్సి వస్తుంది.
కేంద్రం నిర్ణయాలతో….
ఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం తీసుకుంటున్న వరస నిర్ణయాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ప్రత్యేక హోదా విషయాన్ని మరచిపోతున్న సమయంలో పోలవరం నిధుల కోత అంశం రాష్ట్ర బీజేపీ మెడకు చుట్టుకునేలా ఉంది. దీనిపై కొందరు బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం నాడు చెప్పిన మాటకే కట్టుబడి ఉండాలని, లేకుంటే ఏపీలో బీజేపీ మనుగడ అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. త్వరలో కేంద్ర నాయకత్వాన్ని కలసి ఈ విషయాన్ని బీజేపీ నేతలు స్పష్టం చేయనున్నారు.