కోవర్టులు ఎవరో…?
ఏమీ లేదు కాని ఎచ్చులకు మాత్రం తక్కువ లేనట్లుంది ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో బేజీపీ బలపడాలనుకుంటుంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ ను పెంచుకునే [more]
ఏమీ లేదు కాని ఎచ్చులకు మాత్రం తక్కువ లేనట్లుంది ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో బేజీపీ బలపడాలనుకుంటుంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ ను పెంచుకునే [more]
ఏమీ లేదు కాని ఎచ్చులకు మాత్రం తక్కువ లేనట్లుంది ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో బేజీపీ బలపడాలనుకుంటుంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ ను పెంచుకునే దిశగా కాకుండా షార్ట్ కట్ మెథడ్స్ లో నేతలను చేర్చుకోవడం ద్వారా వేళ్లూనుకోవాలనుకుంటోంది. అందుకే భారతీయ జనతా పార్టీ నేతలు గేట్టు తెరిచేశారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటామని నిస్సిగ్గుగా చెబుతున్నారు. అయినా పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి కారణాలేంటి?
చేరికలు భారీగా ఉంటాయని….
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొందరితో పాటు నేతలు బీజేపీలోకి రావాలనుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సయితం బీజేపీలో చేరికలు భారీగా ఉంటాయని చెప్పారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి కారణం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అని కన్నా లక్ష్మీనారాయణ వర్గం భావిస్తుంది. టీడీపీ నేతలు బీజేపీలో చేరకుండా సుజనా చౌదరి అడ్డుకుంటున్నారని కన్నా వర్గం బహిరంగంగానే ఆరోపిస్తుంది.
టీడీపీ నేతలు చేరతామన్నా….
కోస్తా జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు రాయలసీీమ జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు నలుగురు బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారట. అయితే సుజనా చౌదరి వద్దని వారించడంతో వారు విరమించుకున్నట్లు బీజేపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటి ఎమ్మెల్యేలు కూడా తొలుత సుజనా చౌదరితో చర్చించిన తర్వాత వారి ఆలోచన విరమించుకున్నారని కన్నా వర్గం అనుమానిస్తుంది.
డెడ్ లైన్ పెట్టి….
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చేరికపై కూడా నెలల తరబడి జాప్యం చేయడంతో ఆయన నేరుగా నడ్డా వద్దకు వెళ్లి కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మూడు వర్గాలు ఉన్నాయంటున్నారు. ఒకటి కన్నా లక్ష్మీనారాయణ, మరొకటి టీడీపీ నుంచి వచ్చిన సుజనా చౌదరి బ్యాచ్, మరోది ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న నేతలు ఒక వర్గంగా విడిపోయారంటున్నారు. మొత్తానికి బీజేపీ అధినాయకత్వం మాత్రం చేరికలకు డిసెంబరు 8వ తేదీ డెడ్ లైన్ గా విధించారు. ఈలోపు పార్టీలో చేరితే చేరినట్లు. లేకుంటే చేర్చుకోం పొమ్మంటున్నారు. మరి ఈ మూడు కుంపట్లతో కమలనాధులు ఎలా నెట్టుకొస్తారో చూడాలి.