ఫ్లెండ్లీ మ్యాచ్ మాత్రమేనట.. ఆ క్లారిటీ ఉంది

ఏపీ రాజకీయాల్లో మూడు ప్రాంతీయ పార్టీలు నాలుగు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో రెండు పార్టీలు బలంగా అధికారాన్ని, విపక్ష స్థానాన్ని పంచుకున్నాయి. ఇక మూడవ ప్రాంతీయ [more]

Update: 2021-01-04 02:00 GMT

ఏపీ రాజకీయాల్లో మూడు ప్రాంతీయ పార్టీలు నాలుగు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో రెండు పార్టీలు బలంగా అధికారాన్ని, విపక్ష స్థానాన్ని పంచుకున్నాయి. ఇక మూడవ ప్రాంతీయ పార్టీగా జనసేన ఇంకా పురిటి నొప్పులు పడుతోంది. నాలుగు జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ వామపక్షాలు ఉనికి పోరాటం చేస్తూంటే అసలైన హడావుడి మాత్రం బీజేపీది అయింది. ఇపుడు ఏపీ రాజకీయ చరిత్రను తిరగరాస్తాను అంటున్న బీజేపీ కి ఏపీ రాజకీయ ముఖ చిత్రం కాస్తా అయోమయంగానే ఉందని చెప్పాలి.

టీడీపీలో వద్దే వద్దు …

ఇక ఏపీలో బీజేపీ ఇప్పటికి చాలాసార్లు టీడీపీతో చెలిమి చేసింది. అధికారాన్ని రెండు పార్టీలు పంచుకున్నాయి, విడిపోయాయి. అయితే బీజేపీకి ఇపుడు ఆశలు పెరిగాయి, పైగా టీడీపీ మీద ముఖం మొత్తింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు విశ్వసనీయత మీద నమ్మకం కూడా చెదిరింది. అందుకే కొత్త దారులు వెతుకుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తులు పెట్టుకోరాదని మోడీ అమిత్ షా లెవెల్లోనే కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. వారిద్దరికీ చంద్రబాబు ఏంటో బాగా తెలిసిపోయిన వేళ ఆయన్ని చేరదీయడం అన్నది కుదిరే వ్యవహారం కాదని కూడా అంటున్నారు.

జగన్ తోనేనా …?

ఇక ఏపీలో మరో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీలో బీజేపీ రిలేషన్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద అయితే ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. కానీ పై లెవెల్లో అంటే మోడీ, అమిత్ షా జగన్ లెవెల్లో మాత్రం బ్రహ్మాండమైన అవగాహన ఉందని అంటున్నారు. ఏపీ వరకూ జగన్ ని నమ్మకమైన మిత్రుడిగా మోడీ షాలు చూస్తున్నారని తెలుస్తోంది. 2024 కానీ అంతకు ముందు కానీ ఎన్నికలు జరిగితే ఒకవేళ బీజేపీకి కేంద్రంలో అధికారానికి సీట్లు తగ్గినా ఏపీ వరకూ జగన్ కొమ్ము కాస్తాడు అని చాలా బలమైన నమ్మకం మాత్రం బీజేపీ పెద్దలు ఇద్దరికీ ఉందని అంటున్నారు.

తెర ముందు అలా……

ఇక ఏపీ బీజేపీ నాయకులు ఎంతగా జగన్ మీద విమర్శలు చేసినా రెచ్చగొట్టినా జగన్ ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఎందుకంటే కాగల కార్యం హై కమాండ్ వద్దనే జగన్ తేల్చుకుంటారు అన్నది తెలిసిందే. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ కి సవరించిన నిధులను పూర్తిగా భరించేందుకు కేంద్రం ముందుకు రావడం అంటే ఏపీలో తాము జగన్ పక్షంగా ఉన్నట్లు బలమైన సంకేతమే అది. అలాగే జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాయలసీమ ఎత్తి పోతల పధకానికి కేంద్ర జల సంఘం క్లియరెన్స్ ఇవ్వడమూ వైసీపీతో దోస్తీలో భాగనే అంటున్నారు. అందువల్ల జగన్ ఏపీలో ఉండాలి. ఢిల్లీ కోటలో బీజేపీ ఉండాలి ఇదే ఒప్పందం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏపీలో బీజేపీ వైసీపీల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ గానే కధ సాగుతుంది అంటున్నారు. మరి జగన్ ని పూర్తిగా ద్వేషించే పవన్ కళ్యాణ్, ఆయన జనసేన సంగతేంటి అంటే అది ఆయనే బీజేపీతో తేల్చుకోవాలేమో. మొత్తానికి ఏపీ విషయంలో బీజేపీ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లే. ఎనీ డౌట్స్.

Tags:    

Similar News