బీసీ బాబుకు ఝలక్ ఇస్తారా?
కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, ప్రముఖ వ్యాపారి బీసీ జనార్ధన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని నియోజకవర్గంలో [more]
కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, ప్రముఖ వ్యాపారి బీసీ జనార్ధన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని నియోజకవర్గంలో [more]
కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, ప్రముఖ వ్యాపారి బీసీ జనార్ధన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని నియోజకవర్గంలో టీడీపీ మద్దతు దారులు, సానుభూతిపరులు కూడా ఆయన కోసం వెతుకుతున్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన ఆయన డెవలప్‌మెంట్‌కు కేరాఫ్‌గా నిలిచిన మాట వాస్తవం. అయితే, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ సునామీ ముందు ఈ జిల్లాలోని ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా నిలబడలేక పోయారు. వీరిలో బీసీ జనార్ధన్ రెడ్డి కూడా ఒకరు. అయితే, గెలుపు ఓటములు సమానమే అయినా.. ఆయన మాత్రం ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంపై సరిగా దృష్టి పెట్టడం లేదన్న టాక్ వచ్చేసింది.
ప్రజాదరణ ఉన్న నేతగా…
2014లో బనగానపల్లి నుంచి టీడీపీ టికెట్‌పై విజయం సాధించారు బీసీ జనార్ధన్ రెడ్డి. 2014 ఎన్నికలకు ముందు పార్టీ చాలా కష్టకాలంలో ఉన్నప్పుటి నుంచి బీసీ జనార్ధన్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేశారు. అందుకే 2014 ఎన్నికల్లో జిల్లాలో పార్టీ గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీ తరఫున కార్యక్రమాలే కాకుండా ని యోజకవర్గంలోనూ తనదైన శైలిలో అభివృద్ధిని చేసి చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. బీసీ అభివృద్ధినే నమ్ముకున్నా రు. ప్రతి గ్రామానికి తిరిగారు. నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. మూడున్నరేళ్లలో మూడు దశాబ్దాల్లో కూడా ఇక్కడ జరగని, ఎవరూ పట్టించుకోని అభివృద్ధిని చేసి చూపించారు. అదే సమయంలో ప్రతిపక్షం వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అఖిలప్రియతో విభేదాలు….
జైలు పార్టీ నాయకులకు జైలు బుద్ధులే అంటూ మండి పడేవారు. అంతేకాదు, పార్టీ అధినేత చంద్రబాబు విజన్‌ను ముందుకు తీసుకు వెళ్లడంలోనూ బీసీ జనార్ధన్ రెడ్డి ముందున్నారు. ఈ క్రమంలోనే నియజకవర్గంలో వందల కోట్లు ఖర్చు పట్టారనేది వాస్తవం. ఇక కేవలం చివరి 9 నెలల కాలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్, రింగ్ రోడ్డు, హాస్టళ్ల నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులను ముందుండి నడిపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క పార్టీ కార్యకర్తల్లోనూ మంచి పట్టు సంపాయించుకున్నారు. అయితే, వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న భూమా నాగిరెడ్డి కుమార్తె, అప్పటి మంత్రి అఖిల ప్రియతో రగడ వచ్చింది. దీనికి కూడా కీలకమైన కారణమే ఉంది. ప్రతిపక్ష నేతలకు ఆమె సహకరిస్తున్నారని, తన నియోజకవర్గంలోని కాంట్రాక్టులను వైసీపీకి చెందిన తన బంధువులు, ఇంటి పేరటి వారికి అప్పగిస్తున్నారంటూ.. బీసీ జనార్ధన్ రెడ్డి అప్పట్లో తీవ్రంగా విరుచుకుపడేవారు. ఇదే విషయాన్ని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
బాబుపై అసంతృప్తి….
అఖిల సోదరుడు, నంద్యాల తాజా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి స్వయానా కాటసాని రామిరెడ్డి స్వయానా పిల్లనిచ్చిన మామ. ఆయన బీసీ జనార్ధన్ రెడ్డి నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థి కావడం… రామరెడ్డికి అఖిల కాంట్రాక్టులు ఇవ్వడంతో ఆయన ఆగ్రహానికి కారణమైంది. దీనిపై ఆయన ఫిర్యాదు చేసినా బాబు చూస్తాం.. సరిచేస్తాం.. అన్నారే తప్ప అఖిలను గట్టిగా మందలించలేక పోయారనే అసంతృప్తిలో బీసీ జనార్ధన్ రెడ్డిలో అలానే ఉండిపోయింది. ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అభివృద్ధిమంత్రం తనను గెలిపిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, జగన్ సునామీ ముందు ఆయన నిలబడలేక పోయారు. దీంతో సహజంగానే నియోజకవర్గానికి దూరమైనా.. నెలలు గడుస్తున్నా.. ఆయన ఎక్కడా పర్యటించలేదు. దీనికి అధినేత చంద్రబాబుపై ఉన్న అసంతృప్తే కారణమని అంటున్నారు. తనను పట్టించుకోలేదని బీసీ జనార్ధన్ రెడ్డి ఇప్పటికీ అనుచరులతో చెబుతుండడాన్ని బట్టి.. బీసీ జనార్ధన్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు ఆయన అనుచరులు. మరి బాబు ఎలా బుజ్జగిస్తారో ? చూడాలి.