బాబు సంతోష పడినంత సమయం పట్టలేదే?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అసెంబ్లీలో పుంఖాను పుంఖానులుగా రాసుకు వచ్చిన అనేక అంశాలను ఎత్తి చూపుతూ.. తన నియోజకవర్గంలో వైసీపీ అరాచకం సృష్టిస్తోందని [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అసెంబ్లీలో పుంఖాను పుంఖానులుగా రాసుకు వచ్చిన అనేక అంశాలను ఎత్తి చూపుతూ.. తన నియోజకవర్గంలో వైసీపీ అరాచకం సృష్టిస్తోందని [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అసెంబ్లీలో పుంఖాను పుంఖానులుగా రాసుకు వచ్చిన అనేక అంశాలను ఎత్తి చూపుతూ.. తన నియోజకవర్గంలో వైసీపీ అరాచకం సృష్టిస్తోందని పేర్కొన్న ప్రకాశం జిల్లా కొండపి ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి. గత యేడాది ఎన్నికల్లో కొండపి నుంచి వరుసగా రెండోసారి గెలిచిన ఆయన టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎస్సీ ఎమ్మెల్యేగా రికార్డులకు ఎక్కారు. కొన్నాళ్లు నియోజకవర్గంలోనూ, అసెంబ్లీలోను సంచలనం సృష్టించారు. దీంతో అసెంబ్లీలో గళం వినిపించేందుకు మరో తమ్ముడు దొరికాడని చంద్రబాబు సంతోష పడ్డారు. అయితే, ఇంతలోనే ఆయన సైలెంట్ అయిపోవడం నియోజ కవర్గం సహా పార్టీలోనూ చర్చకు దారితీస్తోంది.
వరసగా రెండుసార్లు గెలిచి….
2014, 2019 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించిన స్వామి.. స్వతహాగా వైద్యుడు. ప్రభుత్వ వైద్యుడుగా ఉన్న సమయంలో ఆయన టీడీపీలోకి వచ్చి 2009లో ఓడిపోయినా.. తర్వాత వరుసగా విజయం సాధించారు. 2014లో సైలెంట్‌గా ఉండి తన పనితాను చేసుకుపోయినా.. తర్వాత తర్వాత పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా జిల్లా పార్టీ ఇంచార్జ్ అప్పటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌తోనూ ఆయన విభేదించి టీడీపీలో చర్చనీయాంశం అయ్యారు. జనార్థన్‌ది కొండపి సొంత నియోజకవర్గం కావడంతో కొండపిలో టీడీపీ జనార్థన్, స్వామి వర్గాలుగా చీలిపోయింది.
విభేదాలు కొనసాగుతూ….
అయితే, జనార్దన్ ఓడిపోవడం, స్వామి మళ్లీ గెలవడంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు అలానే ఉన్నాయి. ఇదిలావుంటే, స్వామికి వైసీపీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయనే ప్రచారం కొన్నాళ్లు సాగింది. ఆయన కూ డా సైకిల్ దిగిపోవడం ఖాయమని ఏకంగా స్వామి అనుచరులే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే స్వామికి అడ్డు తొలగించేందుకా? అన్నట్టు.. వైసీపీ నియోజకవర్గం ఇంచార్జ్ మాదాసు వెంకయ్యకు వైసీపీ అధినేత , సీఎం జగన్ డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో స్వామి దాదాపు వైసీపీలోకి రావడం ఖాయమని అనుకున్నారు.
కరోనా రావడంతో…
కానీ, ఇంతలోనే కరోనా ఎఫెక్ట్ రావడంతో ఇప్పుడు నియోజకవర్గంలో రాజకీయాలు సైలెంట్ అయ్యాయి. వాస్తవానికి కరణం బలరాం పార్టీ మారే క్రమంలోనే స్వామి కూడా ఫ్యాన్ కిందకు సేద తీరేందుకు వెళ్లిపోతారన్న ప్రచారమే జిల్లాలో జోరుగా జరిగింది. దీనికి తోడు తనకు శత్రువుగా ఉన్న జనార్థన్‌కు షాక్ ఇచ్చే క్రమంలోనే స్వామిని కూడా బలరాం పార్టీ మారాలని ఒత్తిడి చేశారన్న టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు కరోనాతో ఈ ప్రచారానికి కాస్త బ్రేక్ పడింది. ఇక, స్వామి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చారని, అయితే, ఆయనను కొందరు పక్కన పెట్టారని మాత్రం ఇటీవల ప్రచారం జరిగింది. మొత్తానికి ఇప్పటికైతే.. స్వామి మౌనంగానే ఉన్నారు.