JULY HOROSCOPE : నేటి పంచాగం, జులై 1 నుండి జులై 31 వరకూ రాశిఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెలలో అన్నివిధాలా కాస్త యోగదాయకంగా ఉంటుంది. పనుల్లో కదలికలు ఏర్పడుతాయి.

Update: 2023-06-30 23:30 GMT

july 2023 horoscope in telugu

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శనివారం

తిథి : శు.త్రయోదశి రా.11.02 వరకు
నక్షత్రం : అనురాధ ప.2.58 వరకు
వర్జ్యం : రా.8.09 నుండి 9.38 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.49 నుండి 7.33 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.40 నుండి 11.40 వరకు
జులై నెలలో నవగ్రహ సంచారం
మేషం - గురువు, రాహువు
మిథునం - రవి, బుధుడు
కర్కాటకం - బుధుడు, శుక్రుడు
సింహం - బుధుడు, శుక్రుడు, కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
జులై 1 నుండి జులై 31 వరకూ రాశిఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెలంతా విచిత్రంగా ఉంటుంది. జేబులో పైసా ఉండదు కానీ.. కావాలనుకున్నవన్నీ సమకూర్చుకుంటారు. డబ్బులేదన్న ఆలోచనలతో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. ఎదుటివారికి సలహాలిచ్చి వదిలేయాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెల ఒడిదుడుకులుగా ఉంటుంది. 16వ తేదీ తర్వాత కొంత మార్పు ఉంటుంది. ఆరోగ్యంపై అధిక శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులకు అనుకూలమైన కాలం కాదు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమలు వివాదాస్పదమవుతాయి.
పరిహారం :ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసి, దుర్గాదేవిని ఆరాధించాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెల కుజుడి బలం చేకూరుతుంది. విసుగు చెందే పరిణామాల నుంచి ఊరట వస్తుంది. తగాదాల నుంచి విముక్తి ఉంటుంది. కోపం పెరుగుతుంది. శారీరక సత్తువ తగ్గుతుంది. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు.
పరిహారం : శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెలలో అనుకూలతలు తక్కువగా ఉంటాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు మార్పులు చేర్పులు చేసుకునేందుకు అనుకూలమైన సమయం కాదు. విశ్రాంతి ఉండదు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసి.. పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెలంతా ఒడిదుడుకులుగా ఉంటుంది. ఇన్నాళ్లు పొగిడినవారే అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తారు. నెల చివరిలో ఒడిదుడుకులు మరింత పెరుగుతాయి. ఆపరేషన్లు సక్సెస్ అవుతాయి కానీ.. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వెసులుబాటు ఉన్న తృప్తి లోపిస్తుంది. స్థిరచరాస్తుల కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ మార్పులకు అనుకూలం కాదు.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధమైన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. తలనొప్పుల వంటి వ్యాధులతో సతమతమవుతారు. అనుకున్న ప్లాన్ ప్రకారం పనులు పూర్తికావు. అపార్థాలు పెరుగుతాయి. పనులు కాన్ఫిడెంట్ గా పూర్తిచేయాలి. స్థిరచరాస్తుల కొనుగోళ్లకు అనుకూలం కాదు. నూతన వ్యాపారాలకు, ఉద్యోగంలో మార్పులకు అనుకూలం కాదు.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెలలో అన్నివిధాలా కాస్త యోగదాయకంగా ఉంటుంది. పనుల్లో కదలికలు ఏర్పడుతాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పనుల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. అధికారుల మెప్పు సాధిస్తారు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. కార్యదక్షతగా వ్యవహరిస్తారు. అంతమాత్రాన పట్టిందే బంగారం అన్నట్టుగా ఉండదు. విభేదాలు, తగాదాలు సమసిపోతాయి. ఇంట్లో మారాలనుకున్న వ్యక్తుల్లో మార్పును చూస్తారు.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెలంతా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. గ్రహాలు ప్రతికూలతలతో రిస్క్ కు దూరంగా ఉండాలి. ఇలానే ఉంటా అన్న ధోరణిని మార్చుకోవాలి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయాలి. ఆదివారం మాంసాహారం, మషాళాలతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెల ఒడిదుడుకులుగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఎదుగుదల లేదన్న ఆలోచనలు పెరుగుతాయి. దంపతుల మధ్య తగాదాలు, విభేదాలు ఉంటాయి. మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాలు ఉపయోగపడుతాయి. విద్యార్థులకు అనుకూలం. వాహనాలను నడపకపోవడం మంచిది.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెలలో కష్టేఫలి అన్నట్టుగా ఉంటుంది. ఇష్టపడిన వస్తుసామాగ్రిని కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు ఊరటనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు పెరుగుతాయి. బాధ్యతలకు ప్రాధాన్యమిస్తారు.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెల అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పని కదిలినట్టే ఉన్నా.. ఎక్కడోక చోట ఏదొక అవాంతరంతో ఆగిపోతుంది. రూపాయికి రెండు రూపాయలు ఖర్చవుతుంది. ప్రేమలు వివాదాస్పదమవుతాయి. ఎవరి దగ్గరి నుంచి సహాయం వద్దనుకుంటారో.. వారినే సహాయం కోరుతారు.
పరిహారం : ప్రతిరోజూ సంకష్ఠహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే వినాయకుడిని యధాశక్తిగా పూజించాలి.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ నెలలో ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊరట ఉంటుంది. మంచి వైద్యం పొందుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. చెప్పుకోదగ్గ కష్టాలు, ఇబ్బందులు ఉండవు.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.


Tags:    

Similar News