పూరీ జగన్నాధ రథయాత్ర ప్రారంభం

పూరీ జగన్నాధ రథయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి పూరీ జగన్నాధుడి రథయాత్రను చూసేందుకు తరలి వచ్చారు.

Update: 2025-06-27 04:45 GMT

పూరీ జగన్నాధ రథయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి పూరీ జగన్నాధుడి రథయాత్రను చూసేందుకు తరలి వచ్చారు. ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు పూరీ జగన్నాధ రథయాత్ర జరుగుతుంది. ఈరోజు ఇప్పటికే లక్షల సంఖ్యలో పూరీ చేరుకున్నారు. మొత్తం పదిహేను కిలోమీటర్ మేరకు జగన్నాధుడి రథయాత్ర కొనసాగుతుంది.

భక్తులతో నిండి...
పూరీ వీధులన్నీ భక్తులతో సందడిగా మారాయి. దాదాపు పన్నెండు లక్షల మంది ఈ వేడుకలో పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. తొక్కిసలాట వంటివి జరగకుండా అడుగడుగునా పోలీసులు పహరా కాస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం భద్రతాపరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డ్రోన్ కెమెరాలతో పాటు వేల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసింది. పన్నెండు రోజుల పాటు ఈ వేడుక కొనసాగనుండటంతో పూరీకి దేశం నలుమూలల నుంచి తరలి రానున్నారు.


Tags:    

Similar News