NOVEMBER 24 : నేటి నుండి మార్గశిర మాసం, హేమంతరుతువు ప్రారంభం.. ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. మనస్పర్థలు..

Update: 2022-11-23 23:30 GMT

nov 24th horoscope

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, గురువారం

తిథి : శు. పాడ్యమి రా.1.37 వరకు,
నక్షత్రం : అనూరాధ రా.7.37 వరకు
వర్జ్యం : రా.12.41 నుండి 2.08 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.02 నుండి 10.47 వరకు, మ.2.30 నుండి 3.15 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : మ.3.30 నుండి 4.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల మధ్య పెరుగుతాయి. దృష్టిదోషం అధికమవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. మనస్పర్థలు తొలగుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. శుభకార్యాలు ముందుకు సాగుతాయి. చేపట్టిన ప్రతి పనికి సహకారం అందుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు కలసివస్తాయి. రుణాల విషయంలో మంచినిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో యథాతథమైన స్థితి ఉంటుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అనవసరమైన తగాదాలు చోటుచేసుకుంటాయి. రోజంతా వృథాగా గడిచిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాయిదా పడుతుంటాయి. స్థిరాస్థులపై దృష్టి సారిస్తారు. క్రీడా, కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉండవు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పనివేళలు పెరుగుతాయి. వైద్యులను సంప్రదిస్తారు. విద్యార్థినీ, విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహం లభిస్తుంది. నూతన అవకాశాలను ఉపయోగించుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సూత్రాలను పాటించే ప్రయత్నం చేస్తారు. విదేశీయానానికి ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంచనాలు తారుమారవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు సహా.. అన్నింటికీ ఈరోజు కలసి వస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మనస్పర్థలు తొలగుతాయి. అధికారుల మెప్పు పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. నిరుత్సాహం ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నిదానమే ప్రధానంగా ముందుకు సాగాలి. ముఖ్యమైన పనులు మినహా మిగతా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.


Tags:    

Similar News