NOVEMBER 23 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. మాటపట్టింపులు ఎక్కువవుతాయి. నూతన పరిచయాలు..

Update: 2022-11-22 23:30 GMT

nov 23rd horoscope

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బుధవారం

తిథి : బ.చతుర్దశి ఉ.6.53 వరకు, కార్తీక అమావాస్య గురువారం తె.4.26 వరకు
నక్షత్రం : విశాఖ రా.9.37 వరకు
వర్జ్యం : రా.1.17 నుండి ఉ.2.45 వరకు
దుర్ముహూర్తం : మ.11.31 నుండి 12.16
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం వరకూ అనుకూలంగా ఉంటుంది. అప్పుల వసూళ్ల ప్రయత్నాలు ఫలిస్తాయి. సాయంత్రం తర్వాత మానసికంగా ఆందోళనకరంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక ఊరట లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాతి నుండి అనుకూలంగా ఉంటుంది. ఏ పనైనా సాయంత్రం సమయంలో చేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు వాయిదా పడుతుంటాయి. తగాదాలు ఏర్పడుతాయి. యాంత్రికంగా ఉంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. సాయంత్రం తర్వాతి నుండి పనులు వాయిదా పడుతుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. మాటపట్టింపులు ఎక్కువవుతాయి. నూతన పరిచయాలు మానసిక ఆనందాన్నిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు.
తులా రాశి

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం వరకూ అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం తర్వాత వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం తర్వాతి కాలం అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం వరకూ శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ విఫలమవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. అన్నిరంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది. విద్యార్థినీ, విద్యార్థులు తీసుకునే మంచినిర్ణయాలు కలసివస్తాయి. అప్పుల వసూళ్ల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం తర్వాతి నుండి అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకూ పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. జరిగే సంఘటనలు మనసుకు కష్టం కలిగిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. అన్ని రంగాల, వయసుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిల ఆకుపచ్చ రంగు.



Tags:    

Similar News