MARCH 20 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన తగాదాలు..

Update: 2023-03-19 23:30 GMT

march 20th horoscope

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, సోమవారం

తిథి : బ.చతుర్దశి తె.1.47 వరకు
నక్షత్రం : శతభిషం రా.7.39 వరకు
వర్జ్యం : రా.1.23 నుండి 2.55 వరకు
దుర్ముహూర్తం : మ.12.39 నుండి 1.27 వరకు, మ.3.03 నుండి 3.51 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : మ.12.30 నుండి 1.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచిన రెండు మూడు రోజులకంటే అనుకూలంగా ఉంటుంది. కీలకమైన విషయాలపై దృష్టిసారిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు కూడా మెరుగ్గా ఉంటాయి. సేవింగ్స్ చేయగలుగుతారు. శత్రుబలం తగ్గుతుంది. అధికారుల మెప్పు పొందుతారు. ప్రయాణాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎక్కువగా కెరియర్ పై దృష్టిసారిస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. తగాదాపడితే తప్ప పూర్తికాని పనులపై దృష్టిసారిస్తే మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు కాస్త నిరుత్సాహంగా ఉంటుంది. వ్యాపారస్తులకు నష్టాలుండవు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులకోసం చూసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. ఎదుటివారికి మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. వారి నుంచే సహాయాన్ని అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపార పరంగా సాధారణ ఫలితాలుంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. రకరకాల ఆలోచనలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్ లీడ్ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కోపం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి. ఉద్యోగ మార్పు మంచిదికాదు. వాస్తవికకు దూరంగా ఊహాలోకంలో విహరిస్తారు. ప్రతి విషయం తగాదాతో కూడుకుని ఉంటుంది. మీవైపు నుంచి తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాల్లో చేరేందుకు, నూతన ఉద్యోగ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే నిర్ణయాలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారానికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేసే పనులకు సహకరించేవారు చేరువలో ఉంటారు. ఆర్థికంగా, మాట పరంగా సహాయం చేస్తారు. చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన తగాదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఎవరివల్ల పొరపాటు అయినా.. మీకు రోజంతా చికాకుగా ఉంటుంది. వీలైనంతవరకూ వాహనాన్ని నడపకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు నిదానంగా జరుగుతాయి. ప్రతి విషయంలోనూ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అధికారుల నుంచి ఒత్తిడులు పెరగవచ్చు. శారీరకంగా, మానసికంగా వేగంగా అలసిపోతారు. పనులను వాయిదా వేస్తే లేని ఇబ్బందులను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. లాయర్లు, టీచర్ల వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో, మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రహస్యాలను జాగ్రత్తగా మెయిటేన్ చేయాలి. ఉద్యోగులు కూడా జాగ్రత్తగా ఉండాలి. విలువైన, సెంటిమెంట్ వస్తువుల విషయంలో అధిక జాగ్రత్త వహించాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. శత్రుబలం ఎక్కువగా ఉన్నా.. దానిని తగ్గించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. లాయర్లతో జరిపే సంప్రదింపులు సానుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం పరంగా ఊరట లభిస్తుంది. తెలియని ఆందోళన వెంటాడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. ప్రయాణాలతో అలసిపోతారు. చిన్న చిన్న అనారోగ్యాలతో విసిగిపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.


Tags:    

Similar News