Karthika Pournami : నేడు కార్తీక పౌర్ణమి

నేడు దేశమంతటా కార్తీక పౌర్ణమి వేడుకను జరుపుకుంటున్నారు.

Update: 2025-11-05 01:43 GMT

నేడు దేశమంతటా కార్తీక పౌర్ణమి వేడుకను జరుపుకుంటున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు కార్తీక పౌర్ణమిని జరుపుకుంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ప్రాప్తిస్తుందని, కుటుంబం సుఖ సంతోషంతో విలసిల్లుతుందని భక్తులు భావిస్తారు. ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేపడతారు. ఉదయం నదులు, సముద్ర తీరంలో స్నానం చేసి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తుంది.

దీపారాధన చేసి...
కార్తీకపౌర్ణమి రోజు ఆలయాల్లో దీపారాధన చేస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం కావడంతో ఉదయం నుంచి శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. 365 వత్తులతో దీపారాధన చేయడం ఈ కార్తీక పౌర్ణమి విశిష్టతగా చెబుతారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు కేదారేశ్వర, గౌరీనోములు ఆచరిస్తారు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, మృత్యుంజయ హోమాలను నిర్వహిస్తారు. ఉసిరికాయలతో నేడు దీపాలు వెలిగిస్తే సకల దోషాలు తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. శివాలయాల్లో భక్తులు అధికంగా తరలి వస్తారని భావించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News