Karthika Masam : కార్తీక మాసంలో చేయకూడని పనులివే?

కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం అయింది. అయితే కార్తీకమాసంలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు

Update: 2025-10-22 04:01 GMT

కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం అయింది. అయితే కార్తీకమాసంలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. శివుడికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో నిష్టగా ఉపవాసాలు ఉండటమే కాకుండా, నియమాలు కూడా నిష్టగా పాటించాలంటున్నారు. కేవలం ఉపవాసాలు చేసినంత మాత్రాన, భక్తితో పూజలు చేసినంత మాత్రాన, దీపాలు వెలిగించినంత మాత్రాన కార్తీక మాసంలో పుణ్యం దక్కదు. అలాగే కొన్ని పనులు చేయకూడదని, అవి చేస్తే చేసిన పూజలు అన్నీ వృధా అవుతాయని పండితులు అంటున్నారు.

 చేయకూడని పనులు ఏమిటంటే?
కార్తీకమాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు. కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారుజామునే లేవడం, పుజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విదిగా చేస్తారు. ఈమాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు అంటారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1 ఉల్లిపాయ తినకూడదు.
2.వెల్లుల్లి తినకూడదు.
3.మద్యం, మాంసం జోలికి పోకూడదు.
4.ఎవ్వరికి ద్రోహం చేయరాదు.
5.పాపపు ఆలోచనలు చేయకూడదు.
6.దైవ దూషణ చేయకూడదు.
7.దీపారాదనకు తప్ప నువ్వులనూనె మరి దేనికి ఉపయోగించకూడదు.
8.మినుములు తినకూడదు.
9.నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
10.కార్తీక వ్రతం పాటించేవారు, ఆ వ్రతం చేయనివారి చేతి వంట తినకూడదు.

హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ నియమాలను కార్తీక మాసంలో పాటించాలని పండితులు పదే పదే చెబుతున్నారు. ఈ నెలలో దీపారాధన చేసి శివుడిని నియమనిష్టతో పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కోరిక కోరికలు నెరవేరి అంతా మంచి జరగాలంటే కార్తీక మాసంలో పై పనులు చేయకూడదు.



















Tags:    

Similar News