JULY 21 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనల మేరకు ముఖ్యమైన..

Update: 2023-07-20 23:30 GMT

july 21st horoscope in telugu

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, శుక్రవారం

తిథి : శు. తదియ ఉ.6.58 వరకు
నక్షత్రం : మఖ మ.1.57 వరకు
వర్జ్యం : రా.10.56 నుండి 12.44 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.30 నుండి 9.21 వరకు, మ.12.48 నుండి 1.39 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : ఉ.1.50 నుండి 2.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కెరియర్లో గ్రోత్ కోసం ప్రయత్నించేవారు ఆచితూచి వ్యవహరించాలి. తగాదాలు, చికాకుగానే కాలం నడుస్తుంది. వాహనాలు నడిపేటపుడు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు నిదానంగా జరుగుతాయి. సహకరించేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఒకే సమయంలో అనేక పనులు సానుకూల పరచుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. తెలియని ఆందోళన ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఉంటుంది. ఉద్యోగులు జాగ్రత్తగా మసలుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ల కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయటపెడతారు. అవకాశాల కోసం ఎదురుచూసేవారికి మంచికాలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా విపరీతంగా ఆలోచిస్తారు. మనిషి ఒకచోట, మనసు మరోచోట ఉన్నట్టుగా ఉంటారు. పరిచయాలు కలసివస్తాయి. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలం. ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనల మేరకు ముఖ్యమైన పనులు చేపట్టడం మంచిది. వీలైనంత వరకూ పనులు వాయిదా వేసుకోవాలి. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. ఎదుటివారికి నో చెప్పలేరు. క్రీడా, రాజకీయ, వైద్య వృత్తుల్లో వారికి ఈరోజు ఒత్తిడితో కూడుకున్న వాతావరణం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆరోగ్యం పరంగా ఊరట ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వినోద, విహారయాత్ర కార్యక్రమాలకు ప్లాన్ చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చిన్న చిన్న తగాదాలున్నా మీదే పై చేయిగా ఉంటుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు సరిచేసుకునేందుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు అందుకుంటారు. లౌక్యంగా వ్యవహరిస్తారు. రహస్య శత్రువులను కనుగొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏది మంచి అనిపిస్తే అలాగే నడుచుకుంటారు. ఆర్థికంగా ఎలాంటి లోటుండదు. ఎదుటివారితో ఏర్పడిన అపార్థాలను తొలగించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. పాతపరిచయాలు మరింత బలపరచుకుంటారు. ఏ పనైనా ఈజీగా అవ్వదు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అవునంటే తప్పు.. కాదంటే తప్పుగా ఉంటుంది. వీలైనంత వరకూ మీ పని మీరు చేసుకోవడం మంచిది. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఆర్థిక ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. తాకట్టులు పెట్టకపోవడం మంచిది. శత్రుబలం, దృష్టిదోషం అధికంగా ఉంటాయి. నిదానమే ప్రధానంగా నడుచుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచి సౌకర్యాలు ఏర్పడుతాయి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శుభవార్తలు వింటారు. పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. క్రీడా, రాజకీయరంగాల్లో వారికి సానుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గౌరవ, మర్యాదలు లభిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. రహస్య శత్రువులను కనిపెడతారు. న్యాయపరమైన అంశాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కొత్త ఉద్యోగాన్ని ఆశించేవారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.



Tags:    

Similar News