అక్టోబర్ 9 నుంచి 15వ తేదీ వరకూ ద్వాదశ రాశుల వారఫలాలు

మంచి పని చేయడానికి ఏ సమయం మంచిది ? ఏ సమయంలో చేయకూడదు ? అలాగే ఈ వారం (అక్టోబర్ 9 నుంచి 15 వరకు) ద్వాదశ రాశుల వారికి..

Update: 2022-10-08 23:30 GMT

weekly horoscope

వ్యాపారం, ఇంటి పనులు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు.. ఇలా కొత్తగా ఏ పని చేయాలన్నా.. ముందు మంచి, చెడులను చూస్తారు. మంచి పని చేయడానికి ఏ సమయం మంచిది ? ఏ సమయంలో చేయకూడదు ? అలాగే ఈ వారం (అక్టోబర్ 9 నుంచి 15 వరకు) ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది ? అన్న విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : పూర్ణిమ తె.2.24 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర సా.4.21 వరకు
వర్జ్యం : తె.4.11 నుండి 5.46 వరకు
దుర్ముహూర్తం : సా.4.13 నుండి 5.00 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.3.11 నుండి 4.11 వరకు
ఈ వారం నవగ్రహ సంచారం
మేషం - రాహువు
వృషభం - కుజుడు
కన్య - రవి, బుధుడు, శుక్రుడు
తుల - కేతువు
మకరం - శని వక్రగతిలో
మీనం - గురువు వక్రగతిలో
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం పనులు వాయిదా పడుతుంటాయి. ప్లాన్స్ తారుమారవుతాయి. ఆర్థిక విషయాలు మెరుగవుతాయి. ఒడిదుడుకులుంటాయి. అనవసరమైన వివాదాలుండవచ్చు. శుభకార్యాలపై చర్చలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఈ వారం మంగళ, బుధ వారాలు అనుకూలిస్తాయి. శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. నిరుద్యోగులు ఉద్యోగప్రయత్నాలు పట్టువదలకుండా చేస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూలం. వినోద, విహార కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇతరులకు అప్పు ఇవ్వకపోవడం మంచిది. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అవసరానికి మించిన ఖర్చులుండవు కానీ.. ఆదాయం-వ్యయం సమానంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. భార్య-భర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. గుడ్డిగా అందరినీ నమ్మడం మంచిది కాదు. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ వారాలు అనుకూలిస్తాయి. నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.
కర్కాటకం
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూలమైన ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితిగతులు ఉంటాయి. ఆలోచనలకు రూపాంతరం వస్తుంది. పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ వారమంతా ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. స్వయం కృతాపరాధం మినహా.. ఇతర సమస్యలేవీ ఉండవు. ఈవారం మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలం. ప్రతిరోజూ శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. అపార్థాలు పెరుగుతాయి. ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. చికాకులు పెరుగుతాయి. ప్రతి విషయంలోనూ టెన్షన్, నిరుత్సాహం ఉంటుంది. ఆర్థికపరమైన నష్టాలుండవు. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలిస్తాయి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం బాధ్యతలు, ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన వివాదాలు చోటుచేసుకుంటాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఎదురయ్యే సంఘటనలు భవిష్యత్ ను ప్రశ్నిస్తాయి. ఉన్న పనులు చేసేందుకు సమయం చాలదు. ఆరోగ్యం మెరుగవుతుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలిస్తాయి. ప్రతి రోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మెరుగుదల ఉంటుంది. అనుమానాలు తొలగుతాయి. భవిష్యత్ పై, సంపాదనపై, కుటుంబం వృద్ధి పై దృష్టి సారిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి. ఈ వారం ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రతి విషయంలో తగాదాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాల్లో పురోగతి ఉండదు. ఈ వారం గురు, శుక్ర, శని వారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు పొదుపుపై ఇతరులతో చర్చింకపోవడం మంచిది. అనారోగ్యం తప్పదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రెండో పెళ్లి ప్రయత్నాలు ఫలించవచ్చు. ఈ వారం ఆది, సోమవారాలు కలసి వస్తాయి. ప్రతిరోజూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం మంచిది.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. రుణ ప్రయత్నాలు తప్పవు. అప్పులు తీర్చడంలో ఒత్తిడి తప్పదు. అనారోగ్యం ఉండొచ్చు. బంధువులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎదుటివారి నుంచి సహాయ, సహకారాలు పొందుతారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ కనకధార స్తోత్రాన్ని పటించడం మంచిది.


Tags:    

Similar News