DECEMBER 6 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు, ఇతర చర్చలకు సంబంధించిన అంశాలను..

Update: 2022-12-05 23:30 GMT

december 6th horoscope

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, మంగళవారం

తిథి : శు. త్రయోదశి ఉ.6.47 వరకు
నక్షత్రం : భరణి ఉ.8.38 వరకు
వర్జ్యం : రా.9.32 నుండి 11.15 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.39 నుండి 9.24 వరకు, రా.10.14 నుండి 11.33 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.40 నుండి 1.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. శుభకార్యాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడుల నుండి బయటపడతారు. చర్చలు ఫలిస్తాయి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను మధ్యాహ్నం తర్వాత మొదలుపెట్టడం మంచిది. శుభవార్తలు వింటారు. మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాతి నుండి పనులు వాయిదా పడుతుంటాయి. అలసట పెరుగుతుంది. ప్రయాణాలు కూడా వాయిదా పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. న్యాయవ్యవహారాలను పూర్తి చేసేందుకు కాలం కలసివస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పక్కనే ఉండి ఉచిత సలహాలిచ్చేవారిని పట్టించుకోకపోవడం మంచిది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పెట్టుబడులపై తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు లేత నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సమస్య వెనుక సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అప్పు తీర్చాక.. మరో అప్పు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు, ఇతర చర్చలకు సంబంధించిన అంశాలను మద్యాహ్నం లోపు పూర్తిచేసుకోవడం మంచిది. గడిచిన సంఘటనలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అన్నిరంగాల వారికి కాలం కలిసివస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు లేత పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ చిరాకుగా ఉన్నా.. ఆ తర్వాతి నుండి ఉత్సాహంగా ఉంటారు. వైద్య సంప్రదింపులు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అప్పులు తీసుకోవడం, ఇవ్వడానికి దూరంగా ఉండాలి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. అన్ని వయసుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలు, నూతన స్నేహాలు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత తీసుకునే కొన్నినిర్ణయాలు వాయిదా పడుతుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుండి అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన నిర్ణయాలు కలసివస్తాయి. భవిష్యత్ పై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.


Tags:    

Similar News