ప్రియురాలికి సీక్రెట్ గా పిజ్జా ఇవ్వాలని వెళ్లి
హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో పిజ్జా డేట్ కోసం తన స్నేహితురాలిని
హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో పిజ్జా డేట్ కోసం తన స్నేహితురాలిని రహస్యంగా కలుకోడానికి వెళ్లి.. నాలుగు అంతస్తుల భవనం టెర్రస్ పై నుండి పడి 20 ఏళ్ల బేకరీ కార్మికుడు మరణించాడు. అమ్మాయి కుటుంబం నుండి దాక్కోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. తన ప్రేయసిని కలుసుకోవడం కోసం డెలివరీ బాయ్‌గా వెళ్లగా.. యువతి తండ్రి వచ్చి వాళ్లను చూశాడు. దీంతో భయపడిన యువకుడు కంగారులో నాల్గో అంతస్తు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించి ప్రాణాలు పొగొట్టుకున్నాడు.
మహమ్మద్ షోయబ్ (19) అనే వ్యక్తి బోరబండలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసించే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. యువతి కోరిక మేరకు షోయబ్ పిజ్జా తీసుకొని వాళ్ల ఇంటికి వెళ్లాడు. సడన్‌గా ప్రియురాలి తండ్రి బిల్డింగ్ పైకి రాగా.. భయపడిన యువకుడు నాలుగో అంతస్తు పై నుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్రంగా గాయలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు షోయబ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోయిన వ్యక్తి తండ్రి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.