నెల్లూరు జిల్లాలో జంటహత్యల కలకలం
నెల్లూరు జిల్లాలో జంటహత్యల కలకలం సృష్టించాయి
నెల్లూరు జిల్లాలో జంటహత్యల కలకలం సృష్టించాయి. కొడవలూరు మండలం గండవరం పొలాల్లో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. దగదర్తి మండలానికి చెందిన వెంకటేష్, సంగం మండలానికి చెందిన బాలవెంకయ్యలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యతలతో ఆ ప్రాంతంలో అలజడి మొదలయింది.
పోలీసుల దర్యాప్తులో...
జంట హత్యలు జరగడానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షలతోనే హత్య జరిగిందా? ఇతర కారణాలా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యలు చేయడానికి ఎవరికి అవసరం ఉంటుంది? వారికి ఎవరితోనైనా విభేదాలున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.