గద్వాలలో వివాహిత ఆత్మహత్య.. భర్త వల్ల కాదు
స్థానిక భీంనగర్ కాలనీలో నివాసం ఉంటున్న జయలక్ష్మి(40) ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు
gadwal woman suicide
అపార్ట్ మెంట్ లో ఐదవ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక భీంనగర్ కాలనీలో నివాసం ఉంటున్న జయలక్ష్మి(40) ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం ఆమె నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లోకి వెళ్లిన జయలక్ష్మి ఐదవ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందింది.
స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, జయలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జయలక్ష్మికి మూడేళ్ల క్రితం గద్వాలకు చెందిన సీతారాంరెడ్డితో రెండో వివాహం జరిగింది. వీరికి సంతానం లేరు. తన భర్త తనను చాలా బాగా చూసుకున్నారని, తన పుట్టింటి నుంచే ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఆమె వద్ద లభించిన సూసైడ్ నోట్ లో ఉన్నట్లు తెలిపారు.