యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి

కర్నూలు జిల్లాకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మరణించారు

Update: 2026-02-15 07:23 GMT

కర్నూలు జిల్లాకు చెందిన బొగ్గు శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ లోకి శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది. అయితే వెనక సీట్లో కూర్చున్న బొగ్గుల శ్రీనివాస్ మరణించారు. ముందు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మాత్రం పరారయ్యాడు. కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందిన బొగ్గుల శ్రీనివాస్ సాహిత్య పరిశోధకుడిగానూ, యూట్యూబర్ గానూ గుర్తింపు పొందారు. అతను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో అనే పేరుతో పుస్తకం కూడా రాశారు.

పాలేరు రిజర్వాయర్ లో...
పవన్ కల్యాణ్ అభిమానులు ఆయనను హెచ్చరించారని కూడా తన యూట్యూబ్ వీడియోలో తెలియజేశాడు. దీంతో అప్పట్లో ప్రభుత్వం రక్షణ కూడా కల్పించింది. అయితే ఏపీ 16 డీపీ2345 నెంబరు గల కారు పాలేరు రిజర్వేయర్ లోకి దూసుకెళ్లింది. మత్స్యకారులు గుర్తించి పోలీసులకు, స్థానికులకు సమాచారం ఇచ్చారు. కారు నీళ్లలో మునిగగా వెనక సీట్లో ఉన్న బొగ్గుల శ్రీనివాస్ మరణించనట్లు గుర్తించారు. అయితే డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి నాయకన్ గూడెం వైపు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అతను దొరికితేనే తప్ప ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరావు.


Tags:    

Similar News