చెడ్డీ గ్యాంగ్ కేసులో బెజవాడ పోలీసుల పురోగతి

బెజవాడ పోలీసులు చెడ్డీగ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చెడ్డీ గ్యాంగ్ కేసులో కొంత పురోగతి సాధించారు.

Update: 2021-12-15 06:18 GMT

కొద్దిరోజులుగా.. చెడ్డీ గ్యాంగ్ పేరు వింటేనే బెంబేలెత్తిపోతున్నారు బెజవాజ వాసులు. విజయవాడ, అమరావతి, తాడేపల్లి ఇలా పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడింది చెడ్డీగ్యాంగ్. దీంతో రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు చెడ్డీగ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చెడ్డీ గ్యాంగ్ కేసులో కొంత పురోగతి సాధించారు. గుజరాత్ పోలీసుల సహాయంతో రెండు గ్యాంగ్ లకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ, తాడేపల్లి ప్రాంతాల్లో జరిగిన చోరీల తాలూకు సీసీటీవీ ఫుటేజీలను బెజవాడ పోలీసులు గుజరాత్, మధ్య ప్రదేశ్ పోలీసులకు పంపించారు.

వారి అరెస్ట్ తో..
అక్కడ ఇలాంటి వారు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీగ్యాంగ్ సభ్యులు గుజరాత్ పోలీసులు గుర్తించారు. వారిని దాహెద్ ప్రాంతానికి చెందిన చెడ్డీ గ్యాంగ్ గా గుర్తించారు. గుజరాత్ పోలీసులిచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన బెజవాడ పోలీసులు.. రెండు చెడ్డీగ్యాంగ్ లకు చెందిన నలుగురు దొంగలను అరెస్ట్ చేశారు.
అపరిచత వ్యక్తులు కనిపిస్తే....
మొత్తానికి కొంతకాలంగా బెజవాడ, పరిసరప్రాంతాల వాసులను బెంబేలెత్తిన చెడ్డీగ్యాంగ్ పోలీసులకు చిక్కింది. అదుపులోకి తీసుకున్న నలుగురిని విచారించి, మిగతా వారి పనికూడా పడతామని బెజవాడ పోలీసులు చెప్తున్నారు. కొంతకాలంగా ఈ గ్యాంగ్‌ కదలికలు కనిపించకపోయినా ఇటీవల కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూడటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసు అధికారులు అన్ని జిల్లాల్లోనూ జల్లెడ పడుతూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News