ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

బహ్రైచ్‌లో రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన

Update: 2022-05-29 08:02 GMT

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్‌ బస్సు-ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. లఖింపూర్‌ బహ్రైచ్‌ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఓ మహిళ సహా ఏడుగురు ఉన్నారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయాలైనవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కర్ణాటక నుంచి అయోధ్యకు దర్శనం కోసం వెళ్తున్నారు.

బహ్రైచ్‌లో రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు యూపీ ముఖ్యమంత్రి తెలిపారు. "బహ్రైచ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల పట్ల నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మీడియా ప్రతినిధులతో అన్నారు. కర్ణాటక నుంచి అయోధ్యకు ట్రావెలర్ లో 16 మంది ప్రయాణిస్తున్నారు. మోతీపూర్ ప్రాంతంలోని నానిహా మార్కెట్ ఎదురుగా బస్సు ప్రవేశించినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు.


Tags:    

Similar News