అడ్డంగా బుక్కైన సీఐలు.. కేసు పెట్టిన మహిళా సీఐ భర్త

హనుమకొండ రాంనగర్ కు చెందిన మహిళా సీఐ వరంగల్ సీఐడీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. అక్కడే బలభద్ర రవి అనే..

Update: 2022-10-04 08:51 GMT

subedari police station

వారిద్దరూ ఒకే డిపార్ట్ మెంట్ లో సీఐ లుగా పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కానీ.. వారిద్దరి స్నేహంపై మహిళా సీఐ భర్తకు అనుమానం వచ్చింది. ఫాలో చేశాడు. ఇద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. సీన్ కట్ చేస్తే.. ఇద్దరిపైనా అతను సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఇద్దరు సీఐల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

హనుమకొండ రాంనగర్ కు చెందిన మహిళా సీఐ వరంగల్ సీఐడీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. అక్కడే బలభద్ర రవి అనే మరో ఇన్ స్పెక్టర్ పనిచేస్తున్నాడు. కొద్దిరోజులకు ఇద్దరి మధ్య మాటా మాటా కలిసి చనువు పెరిగింది. ఎంతలా అంటే.. ఒకరింటికి ఒకరు వెళ్లొచ్చేంతవరకు. సీఐడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరి మధ్య మాటమాట కలిసింది. చనువు పెరిగింది. మహబూబాబాద్‌ జిల్లాలో రూరల్‌ సీఐగా పనిచేస్తున్న మహిళా సీఐ భర్తకు అనుమానం వచ్చింది. ఇద్దరిపై తనకున్న అనుమానాన్ని నిరూపించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రవి మహిళా సీఐ ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ముచ్చట్లాడుకున్నారు. విషయం తెలిసిన మహిళా సీఐ భర్త.. తన స్నేహితులతో కలిసివచ్చి ఇద్దర్నీ నిలదీశాడు. రవిని కట్టడి చేసి సుబేదారీ పోలీసులకు అప్పగించారు. రవి అనుమతి లేకుండా తన ఇంటికి వస్తున్నాడని, అడిగిన తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ మహిళా సీఐ భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు సీఐల మధ్య ఎలాంటి సంబంధం ఉందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News