ఉజ్జయినిలో భస్మహారతి ఇస్తుండగా మంటలు చెలరేగడంతో?

ఉజ్జయినిలో హోలీ రోజున విషాదం చోటు చేసుకుంది. మహాకాళేశ్వరుడి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది

Update: 2024-03-25 06:00 GMT

ఉజ్జయినిలో హోలీ రోజున విషాదం చోటు చేసుకుంది. మహాకాళేశ్వరుడి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం హోలీ సందర్భంగా పూజారులు భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పూజారులతో సహా పదమూడు మంది భక్తులు గాయాలపాలయ్యారు. హోలీ కావడతో అధిక సంఖ్యలో భక్తులు ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు.

పూజారులతో పాటు...
ఉదయం భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు పూజారులు గాయపడ్డారు. ఎనిమిది భక్తులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో గాయపడిన వారందరూ కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News