ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్
కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ను ఉప్పరపల్లి కోర్టుకు తరిలించారు. రాజేంద్ర నగర్ సీసీఎస్ కార్యాలయంలో లో ఆయనను విచారించారు
choreographer jony master
కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ను ఉప్పరపల్లి కోర్టుకు తరిలించారు. ఇప్పటి వరకూ రాజేంద్ర నగర్ సీసీఎస్ కార్యాలయంలో లో ఆయనను విచారించారు. నిన్న గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు నేడు హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. ఆయనకు గోల్కొండ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు.
కస్టడీకి కోరే...
ఆయనను కస్టడీని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళ కొరియో గ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై పోక్సో కేసు నమోదయింది. అత్యాచారంతో పాటు లైంగిక వేధింపుల కు సంబంధించిన కేసులు కూడా నమోదు కావడంతో ఆయనను తమ కస్టడీకి వారం రోజులు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని పోలీసులు కోరే అవకాశముంది.