ఆ బిడ్డ నాకు పుట్టలేదంటూ భార్యతో గొడవ పడి..

అటు తల్లి తరపు, ఇటు తండ్రి తరపు తాతముత్తాతల పోలికలో.. మేనమామలు, మేనత్తలు, ఇతర రక్తసంబంధీకుల పోలికలో..

Update: 2023-07-12 14:24 GMT

ఆధునిక పోకడలేమో గానీ.. లేని పోని అనుమానాలతో, అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారనో.. అభం శుభం ఎరుగని బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. కడుపున పుట్టిన బిడ్డలకు తల్లిదండ్రుల పోలికలే రావాలని ఎక్కడా రూల్ లేదు. అటు తల్లి తరపు, ఇటు తండ్రి తరపు తాతముత్తాతల పోలికలో.. మేనమామలు, మేనత్తలు, ఇతర రక్తసంబంధీకుల పోలికలో రావొచ్చు. అంతమాత్రం చేత బిడ్డలు తమ బిడ్డలు కాదంటే ఎలా ? పుట్టిన బిడ్డ తనది కాదని భార్యతో గొడవపడిన భర్త.. పసికందు అన్న విచక్షణ కూడా లేకుండా ఆ బిడ్డ గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లా ఆనైకట్టు సమీపంలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనైకట్టు దేవిశెట్టి పాళెయంకు చెందిన మణికంఠన్ చెన్నై తాంబరం ఎయిర్ పోర్టులోని క్యాంటీన్ లో పనిచేస్తున్నాడు. మణికంఠన్ భార్య హేమలత (21) 26 రోజుల క్రితమే ప్రసవించింది. ఆదివారం (జులై 9) సెలవు కావడంతో భార్య, బిడ్డను చూసేందుకు అత్తగారి ఊరికి వెళ్లాడు. అక్కడ బిడ్డను చూసిన మణికంఠన్ ఆ బిడ్డ తనకు పుట్టలేదంటూ భార్య హేమలతతో గొడవపడ్డాడు. గొడవ తారస్థాయికి చేరడంతో.. కోపం పట్టలేక ఆ పసికొందు గొంతు నులిమి చంపేశాడు. హేమలత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మణికంఠన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News