Pakistan : ఘోర అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు

Update: 2023-12-25 02:24 GMT

 terrible fire accident has occurred in pakistan

పాకిస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. ఇంటిలో ఒక మహిళ, నలుగురు కుమార్తెలతో పాటు ఎనిమిది మంది పిల్లలున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ లోని అబోటాబాద్ జిల్లా తహరి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా ఇల్లు కూలిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.

మృతులందరూ...
ఈ ఇంట్లో ఒక మహిళ తన నలుగురు కూతుళ్లతో పాటు ఎనిమిది మంది చిన్నారులు నివసిస్తున్నారు. భవనం శిధిలాల నుంచి తొమ్మిది మంది మృతదేహాలను వెలికి తీశారు. తొమ్మిది మందిలో ఎవరెవరు మరణించారన్న విషయం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. అధికారులు సహాయక చర్యలనుప ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ఘటనలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి సాయం ప్రకటించాలని కోరుతున్నారు.


Tags:    

Similar News