అనంతలో కొండమీద నుంచి పడిన కారు
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుక్కరాయ సముద్రంలో కొండమీద నుంచి కారు కిందపడిపోయింది.
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుక్కరాయ సముద్రంలో కొండమీద నుంచి కారు కిందపడిపోయింది. ప్రమాదమా? ఆత్మహత్యా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో శ్రీవిద్యానికేతన్ కరస్పాండెంట్ ఉమాపతి ఈ ప్రమాదంలో మరణించారు.
ఆత్మహత్యా? హత్యా?
కారు వేగంగా వచ్చి కొండపై నుంచి కిందపడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమాపతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.