పడవ బోల్తా - 68 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్
యెమన్ లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో పడవ బోల్లా పడిన ఘటనలో అరవై ఎనిమిది మంది మృతి చెందారు
యెమన్ లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో పడవ బోల్లా పడిన ఘటనలో అరవై ఎనిమిది మంది మృతి చెందారు. వీరితో పాటు పడవలో ఉన్న మరో డెబ్భయి నాలుగు మంది గల్లంతయ్యారు. నిన్న జరిగిన ఈ ఘటన విషాదం నింపింది. 154 మంది వలసదారులతో వెళుతున్నపడవ యెమన్ అభ్యాస్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది. దీంతో పడవ బోల్తా పడింది. పడవలో ప్రయాణిస్తున్న 154 మది సముద్రంలో పడిపోయారు.
పన్నెండు మాత్రమే.. క్షేమం...
ఇందులో కేవలం పన్నెండు మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన వారంతా సముద్రంలో పడి గల్లంతయ్యారు. అయితే సముద్రంలో కొట్టుకుపోయిన వారిలో 54 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఖాన్పర్ జిల్లాలోని సముద్రతీరానికి ఈ మృతదేహాలు కొట్టుకు రావడంతో పాటు మరికొన్ని మృతదేహాలు వేరే ప్రాంతంలో కనిపించాయి. గల్లంతయిన మరో 74 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.గల్ఫ్ దేశాలకు తూర్పు ఆఫ్రికాకు చెందిన వారు పెద్ద సంఖ్యలో వలస వెళుతుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగింది.