తిరుపతి ఏటీఎంలో 70 లక్షలు గల్లంతు.. నిందితుల అరెస్ట్

తిరుపతిలోని ఏటీఎంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 70 లక్షల రూపాయలను దోచుకున్నారు

Update: 2021-12-10 03:31 GMT

తిరుపతిలోని ఏటీఎంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 70 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఏటీఎంలను ట్యాంపరింగ్ చేసి ఈ నగదును ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఏటీఎం ట్యాంప్ రింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి నిందితులను గుర్తించారు.

99 ఏటీఎం కార్డులు...
నిందితుల నుంచి 99 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ హర్యానా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. హర్యానాలోని పిప్రోలి గ్రామానికి చెందిన ఆరిఫ్ ఖాన్, సలీంఖాన్ లను అదుపులోకి తీసుకోవడంతో ఈ బండారం బయటపడింది. వీరికి మరో ముగ్గురు సహకరించారని, వారు పరారీలో ఉన్నారని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు.


Tags:    

Similar News