రద్దీ ఉన్న ప్రాంతాలు.. వీకెండ్ లో.. పీక్ అవర్స్ లోనే బాంబ్ బ్లాస్ట్ లకు ప్లాన్

బాంబు పేలుళ్ల కేసులో పట్టుబడిన సిరాజ్ గ్యాంగ్ వేసిన స్కెచ్ మామూలుగా లేదు.

Update: 2025-05-28 04:22 GMT

బాంబు పేలుళ్ల కేసులో పట్టుబడిన సిరాజ్ గ్యాంగ్ వేసిన స్కెచ్ మామూలుగా లేదు. తొలుత విజయనగరంలోనే బాంబ్ బ్లాస్ట్ చేయాలన్నది పథకంలో ప్రధానం. మారుమూల ప్రాంతంలో ఉన్న జిల్లా కేంద్రంలో బాంబుపేలుళ్లు జరిపితే ఎవరికి అనుమానం రాదని, దాని విచారణ కొనసాగేలోపు హైదరాబాద్ లో మరికొన్ని ప్రాంతాల్లో వరస బాంబ్ బ్లాస్ట్ లకు సిరాజ్ గ్యాంగ్ ప్లాన్ చేసింది. సౌదీ నుంచి వచ్చిన డైరెక్షన్ మేరకు జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు పీక్ అవర్స్ లోనే బాంబు పేల్చి భారీగా ప్రాణ నష్టం కలిగించాలన్నది సిరాజ్ కు సౌదీ నుంచి వచ్చిన ఆదేశాలు అని ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలినట్లు తెలిసింది. దీంతో వీరి అరెస్ట్ తో పెద్దముప్ప తప్పింది.

యువతను సమీకరించి...
ఉదయం వేళ కంటే సాయంత్రం వేళ రద్దీ ఎక్కువగా ఉంటుందని, వీకెండ్ లో అయిదే జనాలు ఎక్కువగా ఉంటారని, ఆ సమయంలోనే బాంబ్ బ్లాస్ట్ చేయాలని సిరాజ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. బస్టాండ్ లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్ వంటి ప్రాంతాల్లో బాంబు బ్లాస్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి ఒక సామాజికవర్గానికి చెందిన యువకులను పెద్దయెత్తున సమీకరించి వారిని ఉగ్రవాదం వైపు మళ్లించాలన్నది కూడా సిరాజ్ కు అందిన ఆదేశాలని వినికిడి. వారిని స్లీపర్ సెల్స్ గా మార్చి అహీమ్ సంస్థ ద్వారా పేలుళ్లకు ఈ ప్లాన్ వేసినట్లు సిరాజ్ ఎన్ఐఏ అధికారుల విచారణలో అంగీకరించారు. విజయనగం అయితే ఎవరికీ అనుమానం రాదని, విచారణ ప్రారంభమయ్యే సరికి మనం అక్కడి నుంచి వెళ్లేందుకు సులువుగా ఉంటుందని భావించారు. పొరుగున ఉన్న ఒడిశా మీదుగా బయలు దేరి ఇతర రాష్ట్రాల్లో కొన్ని రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నారు.
మ్యాజిక్ లాంతర్ ద్వారా...
సిరాజ్ గ్యాంగ్ హైదరాబాద్, విజయనగరంలో రెక్కీ నిర్వహించడంతో ఆ యా ప్రాంతాల్లో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ తో పాటు వరంగల్, బెంగళూరు, ఢిల్లీలో జరిగిన సమావేశాలకు ఎవరెవరు హాజరయ్యారు? ఎంత మంది ఈ ప్లాన్ లో భాగస్వామ్యులయ్యారు? సమావేశం వివరాలపై సిరాజ్, సమీర్ లను ఆరా తీసినట్లు తెలిసింది. కర్ణాకట, మహారాష్ట్రకు చెందిన పన్నెండు మంది సభ్యులపై కూడా ఆరా మొదలయింది. అదే సమయంలో స్లీపర్ సెల్స్ ను బలోపేతం చేయడానికి మ్యాజిక్ లాంతర్, సౌదీ , ఒమన్, పాకిస్తాన్ ల నుంచి నిధులు భారీగా వచ్చినట్లు అనుమానం ఎన్ఐఏ అధికారుల్లో వ్యక్తమవుతుంది. ఆ దిశగా విచారణ కొనసాగుతున్నట్లు తెలిసింది. సిరాజ్, సమీర్ లను మరికొంత కాలం కస్టడీకి కోరుతూ న్యాయస్థాననంలో పిటీస్ వేయాలని కూడా ఎన్ఐఏ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.


Tags:    

Similar News