సిరాజ్ చిక్కకపోయినట్లేతే.. మామూలు విధ్వంసం జరిగి ఉండేది కాదట

విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్ర కేసులో అరెస్టయిన సిరాజ్ పాకిస్తాన్ లోని ఐఎస్ఐ దృష్టిలో కూడా పడ్డాడు

Update: 2025-06-01 04:08 GMT

విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్ర కేసులో అరెస్టయిన సిరాజ్ పాకిస్తాన్ లోని ఐఎస్ఐ దృష్టిలో కూడా పడ్డాడు. అంతా బాగున్నట్లయితే ఐఎస్ఐ శిక్షణ పొందేందుకు కూడా సిరాజ్ వెళ్లేవాడు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల విచారణలో ఈ విషయం స్పష్టమయింది. విదేశాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు కూడా సిరాజ్ నెలకొల్పిన అహిం సంస్థను గుర్తించాయంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి సిరాజ్ ఏ స్థాయికి సంస్థను తీసుకెళ్లాడో చెప్పాల్సిన పనిలేదు. అహిం అంటే ఆల్ హింద్ ఇత్తేహదుల్ ముస్లమీన్ అని పేరుపెట్టడం, ముస్లిం మహిళలను రక్షించడం కోసం ఈ సంస్థ ఏర్పాటు చేసినా తన కార్యకలాపాలతో విదేశాల్లోని పలు ఉగ్ర సంస్థలను ఆకర్షించగలిగాడంటే మామూలోడు కాదని ఎన్ఐఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఐఎస్ఐ ద్వారా శిక్షణ పొందేందుకు...
తమకు సిరాజ్ పట్టుబడకుండా ఉండి ఉంటే అతి ప్రమాదకరమైన ఉగ్రవాదిగా తయారయ్యేవాడని కూడా అభిప్రాయం ఎన్ఐఏ అధికారుల్లో వ్యక్తమవుతుంది. అంటే ఏ రేంజ్ లో సిరాజ్ ప్లాన్ చేశాడన్నది తెలుసుకున్న అధికారులు ఆశ్చర్యపోయారట. అహిం పేరిట ఏర్పాటు చేసిన సంస్థను గుర్తించేలా సిరాజ్ పక్కా ప్లాన్ తో వెళ్లారని అంటున్నారు. అందుకోసమే నిధులు పెద్దయెత్తున అహిం సంస్థకు బదిలీ అయ్యాయని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్ తో పాటు సమీర్ కూడా చెప్పిన విషయాలను క్రోడీకరించుకుని చివరకు తాను పెద్ద విధ్వంసం కూడా చేయడానికి సిద్ధమయ్యాడని గుర్తించాయి. అందుకే దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో నిన్న ఎన్ఐఏ అధికారులు పదిహేడు చోట్ల దాడులు, సోదాలు నిర్వహించారు.
అనేక రకలా జాగ్రత్తలు తీసుకుని...
అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సౌదీ అరేబియాలో, పాకిస్థాన్ లో ఉంటున్న వారితో టచ్ లోకి వెళ్లిన సిరాజ్ తన ప్లాన్ మొత్తాన్ని వివరించడంతో వారు ఇంప్రెస్ అయ్యారని కూడా ఎన్ఐఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే నిధులు ఇచ్చేందుకు వారు ముందుకొచ్చారన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అయితే ఎక్కడా దొరకకుండా సిరాజ్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు నిధులు కూడా తన పేరిట కాకుండా విజయగనారికి చెందిన మరొక వ్యక్తి ఖాతాలో జమ అయ్యేలా చూసుకున్నాడు. పేలుడు పదార్థాలు కూడా ఆన్ లైన్ లో బుక్ చేయడమే కాకుండా ఉర్దూ పాఠశాల అడ్రస్ ఇవ్వడం కూడా సిరాజ్ వ్యూహంలో భాగమేనంటున్నారు. మొత్తం మీద సిరాజ్ ముందుగా అరెస్ట్ కాకుండా ఉండి ఉంటే విజయనగరం, హైదరాబాద్ లో భారీ పేలుళ్లు జరిగి ఉండేవని, ప్రమాదం తప్పిందన్నఅభిప్రాయం వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News