Road Accident : కాల్వలో పెళ్లి వాహనం బోల్తా.. 9 మంది మృతి
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి కాల్వలో పడటంతో తొమ్మిది మంది మరణించారు.
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫతేహాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి కాల్వలో పడటంతో తొమ్మిది మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సర్దారెవాలా గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెళ్లివేడుకకు వెళ్లి పదమూడు మంది ఒక జీపులో తన గ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు.
వాహనం అదుపు తప్పి...
అయితే జీపు అదుపు తప్పి క్రూజర్ బాఖడా కాల్వలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అందులో ఇద్దరిని మాత్రమే రక్షించగలిగారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, పదకొండేళ్ల చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.