Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా కశింకోటలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా కశింకోటలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఇద్దరు మరణించగా ఒక మహిళకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసి తన స్వగ్రామానికి ఇద్దరు మహిళలు వెళుతున్నారు.
జాతీయ రహదారిపై...
వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, మరొక మహిళ మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బొలేరో వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు పోలీసులు క్రేన్లు తెప్పించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.