కుంభమేళా నుండి తిరిగొస్తున్న తెలుగువాళ్లు .. ఇంతలో
ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ వాసులు
Rangampally road accident
ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లిన తెలుగువాళ్లు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైవేపైకి ట్రక్కు రాంగ్ సైడ్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు మినీ బస్సులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.