ఎర్రచందనం స్మగ్లింగ్ : చంద్రగిరిలో 14 దుంగలు స్వాధీనం, ఒకరు అరెస్ట్

ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మూలపల్లి అటవీప్రాంతం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. టమోటా లోడుతో

Update: 2022-02-06 11:33 GMT

చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంతం ఎర్రచందనం స్మగ్లింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అక్రమార్కులపై పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. స్మగ్లర్లలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా పోలీసుల కళ్లు గప్పి టమోటా లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలనుకున్నారు. కానీ.. పోలీసుల తనిఖీలతో స్మగ్లర్ల ప్లాన్ కాస్తా బెడిసి కొట్టింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మూలపల్లి అటవీప్రాంతం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. టమోటా లోడుతో అనుమానాస్పదంగా వెళుతున్న మినీ వ్యాన్ ను తనిఖీ చేయగా.. పైన టమోటా బుట్టలు, కింద ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పుష్ప సినిమాలో మాదిరిగా.. లగేజీ ఆటోకు కింద భాగంగా రహస్య క్యారేజీ ఏర్పాటు చేసి, ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.



Tags:    

Similar News