పులివెందుల కాల్పుల ఘటన.. దిలీప్ మృతి
భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి దిలీప్ పై కాల్పులు జరుపగా.. అతనికి ఛాతీ, తలపైనా బుల్లెట్ గాయాలయ్యాయి. భరత్ - దిలీప్ ల మధ్య
Pulivendula Area Hospital
కడప జిల్లా పులివెందులలో నేడు జరిగిన కాల్పుల్లో గాయపడిన దిలీప్ అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి దిలీప్ పై కాల్పులు జరుపగా.. అతనికి ఛాతీ, తలపైనా బుల్లెట్ గాయాలయ్యాయి. భరత్ - దిలీప్ ల మధ్య ఉన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో పులివెందుల వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద దిలీప్ పై దాడి జరిగింది. భరత్ కుమార్ ఐదు రౌండ్లు కాల్పులు జరుపగా.. దిలీప్, మహబూబ్ బాషా గాయపడ్డారు. వీరిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
దిలీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో వేంపల్లె వద్ద మృతి చెందాడు. వేంపల్లె ఆస్పత్రికి దిలీప్ ను తీసుకెళ్లగా.. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో భరత్ లైసెన్స్ డ్ తుపాకీని ఉపయోగించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ కు భరత్ కుమార్ యాదవ్ బంధువని సమాచారం. వివేకా హత్య కేసులో భరత్ కుమార్ యాదవ్ ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ప్రస్తుతం భరత్ పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.