టీ తాగేందుకు వెళ్లిన యువకులు.. ఇంతలో
ప్రకాశం జిల్లాలో ఊహించని విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో
Prakasham district road accident three friends death news
ప్రకాశం జిల్లాలో ఊహించని విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మణం పాలయ్యారు. బెస్తవారిపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద ఈ తెల్లవారుజామున జరిగిందీ ఘటన. పాపాయిపల్లికికి చెందిన పవన్ (20), శ్రీనివాస్ (21), రాహుల్ (21) టీ తాగేందుకు బైక్‌పై పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు బయల్దేరారు. ఈ క్రమంలో ఎదురుగా గిద్దలూరు నుంచి బెస్తవారపేట వైపు వస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి వేగంగా వచ్చిన వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో యువకులు ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో పాపాయిపల్లిలో విషాదం నెలకొంది.