పోలీసులకు లొంగిపోయిన పూర్ణ చందర్ ఏమన్నారంటే?

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పూర్ణచందర్ రావు లొంగిపోయారు

Update: 2025-06-29 03:58 GMT

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పూర్ణచందర్ రావు లొంగిపోయారు. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ పై ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత పూర్ణ చంద్రరావు ఒక లేఖ కూడా విడుదల చేశారు. తాను ఆమె ఆత్మహత్యకు కారణం కాదని, ఆమె మృతికి ఆమె మానసిక పరిస్థితి, ఆమె తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని లేఖలో తెలిపారు.

న్యాయవాదితో కలిసి...
నిన్న రాత్రి 11 గంటల సమయంలో న్యాయవాదితో కలిసివచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయిన పూర్ణ చందర్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నేడు ఆదివారం కాబట్టి పూర్ణ ను విచారించి రేపు అరెస్ట్ చేసే రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని తెలిసింది. అయితే స్వేచ్ఛ సెల్ ఫోన్ తో పాటు పూర్ణచందర్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషించి విచారణ జరుపుతున్నారు.


Tags:    

Similar News