Jony Master : జానీ మాస్టర్ అరెస్ట్‌పై పోలీసుల అధికారిక ప్రకటన
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్‌పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. తాము గోవాలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు
choreographer jony master
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్‌పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. తాము జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. రేపు ఉప్పర్‌పల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉప్పరపల్లి కోర్టులో...
గోవా కోర్టులో హాజరుపర్చి పీటీ వారెంట్ తో హైదరాబాద్‌కు తరలిస్తున్నామని తెలిపారు. కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు నమోదయింది. మహిళ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేయడమే కాకుండా ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకు వస్తున్నారు.