హైదరాబాద్ లో నకిలీ చాక్లెట్ల దందా
హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్ల దందాను పోలీసులు బయటపెట్టారు. నాసిరకం చాక్లెట్లు తయారు చేస్తున్న వారిని అరెస్ల్ చేశారు
హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్ల దందాను పోలీసులు బయటపెట్టారు. నాసిరకం చాక్లెట్లు తయారు చేస్తూ పిల్లల ఆరోగ్యంతో ఆడుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దందా నిర్వాహకుడు అహ్మద్‌తో పాటు అందులో పనిచేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందిన సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు నకిలీ చాక్లెట్లు తయారు చేయడానికి ఉపయోగపడుతున్న ముడిపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
బేగంబజార్‌లో విక్రయంపై....
సులేమాన్‌నగర్ కు చెందిన అహ్మద్ ఎంకే స్వీట్స్ పేరుతో ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటు చేశాడు. ఈ చాక్లెట్ లో రసాయనాలు, సిట్రిక్ యాసిడ్ కలిపి నాసికరం చాక్లెట్లను తయారు చేస్తున్నాడు. వాటిని హోల్‌సేల్ గా బేగంబజార్ వ్యాపారులకు కారు చౌకగా విక్రయిస్తున్నారు. అయితే పోలీసులకు సమాచారం అందడంతో ఈ చిన్నపాటిపరిశ్రమపై దాడులు నిర్వహించి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.