బీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ కేసులో కీలక మలుపు.. నిందితుడిపై రేప్ కేసు!

ఏపీలో సంచలనంగా మారిన బీఫార్మసీ విద్యార్థిని కేసులో నిందితుడు సాదిక్‌పై రేప్ కేసు నమోదు చేశారు.

Update: 2022-05-09 09:31 GMT

సత్యసాయి జిల్లా గోరంట్లకి చెందిన బీఫార్మసీ విద్యార్థిని కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితుడు సాదిక్‌పై అత్యాచారం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. బీఫార్మసీ విద్యార్థినిని నిందితుడు సాదిక్ ప్రేమ పేరుతో మోసం చేశాడని.. ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడని తెలిపారు. అతనిపై చీటింగ్, అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సెక్షన్లు 420, 376, 306 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశామని.. రెండు వారాల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేస్తామని పోలీసులు తెలిపారు.

అయితే విద్యార్థిని కేసులో తొలి నుంచీ ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కూతురిని పిలిపించి సామూహిక అత్యాచారం చేసి చంపేశారని.. శవాన్ని ఉరి వేసుకున్నట్లు వేలాడదీశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తాము రాకుండానే పోస్టుమార్టం చేశారని.. తమకు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆమెపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు లేవని.. ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా నిందితుడిపై రేప్ కేసు కూడా నమోదు కావడం గమనార్హం.

ఈ ఘటన అటు రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. తేజస్విని మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని.. సిట్ ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే నిజనిర్ధారణ పేరుతో బీజేపీ ఓ కమిటీ వేసింది. సదరు కమిటీ గ్రామంలో తిరిగి వివరాలు సేకరించింది. ఈరోజు రాష్ట్ర డీజీపీని కలిసిన బీజేపీ టీమ్ సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చింది. బాధితురాలి కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. రక్షణ కల్పించాలని కోరింది. అత్యాచారం, హత్య జరిగితే రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Tags:    

Similar News