మహిళతో గొడవ పడి.. తిట్టి పక్కకు తోసేసిన పొలిటీషియన్..!

తన పెంపుడు కుక్కలను పోలీసు అధికారులపై పంపుతానని బెదిరించాడు.

Update: 2022-08-06 11:13 GMT

హౌసింగ్ సొసైటీలో మహిళతో గొడవ పడి ఆమెపై దాడి చేసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఓ రాజకీయ నాయకుడిపై నోయిడా పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. రాజకీయ నాయకుడు శ్రీకాంత్ త్యాగి.. తాను బీజేపీ కిసాన్ మోర్చా సభ్యుడినని చెప్పుకొచ్చాడు. పలువురు బీజేపీ సీనియర్ నాయకులతో అతడు కలిసి ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో కనిపించాయి. అతడికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదని పార్టీ స్థానిక యూనిట్ తెలిపింది.

నోయిడా సెక్టార్-93బిలోని గ్రాండ్ ఓమాక్స్ సొసైటీలో శ్రీకాంత్ త్యాగి కొన్ని చెట్లను నాటడం పట్ల ఆ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో శ్రీకాంత్ త్యాగి బూతులు తిట్టి.. మహిళను పక్కకు తోసేశాడు. ఈ ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. త్యాగి దూకుడుగా ప్రవర్తించి.. మహిళపై దాడి చేసిన వీడియో వైరల్ అయింది. ఆమె భర్తపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా.. ఆమెను కించపరిచేలా వ్యాఖ్యలు కూడా చేశాడు.
శ్రీకాంత్ త్యాగిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354 కింద కేసు నమోదు చేయబడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక పోలీసు బృందాన్ని సాయంత్రం హౌసింగ్ సొసైటీకి పంపారు, అయితే త్యాగి తన ఇంటి తలుపులు తెరవలేదు. తన పెంపుడు కుక్కలను పోలీసు అధికారులపై పంపుతానని బెదిరించాడు. దీంతో అతడిని అరెస్టు చేయలేకపోయారు. త్యాగి పరారీలో ఉన్నారని, అతని కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మహిళా భద్రత) అంకితా శర్మ శుక్రవారం రాత్రి తెలిపారు.


Tags:    

Similar News