బాంబు పేలుళ్లు జరపాలనుకున్నది అక్కడేనట.. రెక్కీ జరిపారట.. ఎంత ప్రమాదం తప్పింది?
సిరాజ్, సమీర్ లు ఐదు చోట్ల బాంబులతో పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయింది
సిరాజ్, సమీర్ లు ఐదు చోట్ల బాంబులతో పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయింది. గత రెండు రోజులుగా సిరాజ్, సమీర్ లను విచారిస్తున్నారు. ఈ విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అహీం పేరుతో గ్రూపు ను ఏర్పాటు చేసి అందులో సభ్యులతో ఈ పేలుళ్లకు కుట్రపన్నినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడయింది. హైదరాబాద్, వరంగల్, విజయనగరం, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో వరసగా పేలుళ్లు జరపాలని వీరు ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఈ పేలుళ్లతో తాము ఇండియాకు సవాల్ విసరాలని కూడా వారు సంభాషించుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో స్పష్టమయినట్లు పోలీసు అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.
ఆర్థిక సాయాన్ని...
విజయనగరంలో అరెస్ట్ చేసిన సిరాజ్, సమీర్ లను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. అయితే తొలి రోజు పెద్దగా సమాధానం ఇవ్వని వారు రెండో రోజు మాత్రం వారు ఎన్ఐఏ అధికారులు వేసిన ప్రశ్నలకు నిర్భయంగానే సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఈ ఐదు ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నామని కూడా వారు వివరించినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సామాగ్రిని కూడా సిరాజ్ ను కొనుగోలు చేసి వారికి పంపే ప్రయత్నంలో ఉన్నారు. వారికి బాంబుపేలుళ్లు జరపడంపై ఆన్ లైన్ లోనే ట్రెయినింగ్ ఇచ్చేందుకు కూడా సౌదీ నుంచి కొందరు సిద్ధమయ్యారని ఎన్ఐఏ అధికారులు సమక్షంలో అంగీకరించినట్లు తెలిసింది.
అహీం గ్రూపులో ఉన్న...
మరోవైపు అహీం గ్రూపులో ఉన్న వారి కదలికలతో పాటు వారు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నారు? వారి చిరునామాలు సేకరించే పనిలో ఉన్నారు. సౌదీ నుంచి వచ్చిన డబ్బులతో పాటు ఇంకా ఎవరెవరు ఆర్థిక సాయం అందిస్తారన్న దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా ఎవరైనా వారికి సాయం అందించారా? అన్న దారిపై ఎన్ఐఏ అధికారులు విచారణలో ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ వెనక ఉన్న వారితో పాటు వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం అందించే వారి వివరాలను సేకరించి వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని ఎన్ఐఏ అధికారుల ప్రయత్నంగా ఉంది. ఆగస్టు పదిహేనో తేదీకి ఈపేలుళ్లు జరపాలని ప్రయత్నం చేశారా? అన్న దానిపైన, ఏ నగరాల్లో ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించిన విషయాన్ని, పేలుళ్లు ఎక్కడ జరపాలన్న దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు.