విజయనగరం ఉగ్ర కుట్ర కేసు హైదరాబాద్ కు షిఫ్ట్ అయిందిగా?

విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కొనసాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ కొనసాగుతుంది

Update: 2025-05-30 04:20 GMT

విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కొనసాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ కొనసాగుతుంది. వారం రోజుల పాటు సిరాజ్, సమీర్ ను విచారించిన ఎన్ఐఏ అధికారులు విచారణలో వెలుగు చూసిన అంశాలపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా సిరాజ్, సమీర్ లను విచారించిన అనంతరం అనేక విషయాలు వెలుగు చూశాయి. పేలుళ్లకు ఎక్కడెక్కడ ప్లాన్ చేసింది? నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నిధులను ఎక్కడెక్కడ వేటికి ఖర్చు చేశారన్న దానిపై ఎన్ఐ అధికారులు ఆరా తీసి సిరాజ్,సమీర్ లు విచారణలో వెలుగు చూసిన విషయాల మేరకు ఆ దిశగా దర్యాప్తు కొనసాగించాలని నిర్ణయించారు. విజయనగరం నుంచి కొన్ని ఎన్ఐఏ బృందాలు ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, వరంగల్ కు వెళ్లినట్లు సమాచారం.

కుటుంబ సభ్యులపైనా?
విజయనగరంలో సిరాజ్ కు సహకరించిన వారిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. సిరాజ్ ను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించింది ఎవరు? వారి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలుసా? సిరాజ్ గత కొంతకాలం నుంచి ఉగ్రవాదం వైపు మళ్లినా కుటుంబ సభ్యులు ఎందుకు వారించలేదు? సిరాజ్ బ్యాంకు అకౌంట్ లోకి అంత డబ్బు వచ్చినప్పుడు ఎందుకు అనుమానం రాలేదు? సిరాజ్ తండ్రి పోలీసు అధికారి అయినా ఎందుకు అనుమానించలేదు? అంత డబ్బు వచ్చినప్పుడు కారణం తెలుసుకుని ఎందుకు వారించలేదు. వారి ప్రమేయం ఉందా? అన్న దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు లాకర్ నుకూడాతెరిచేందుకు సిరాజ్ తండ్రి ఎందుకు ప్రయత్నించాడన్న దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ లో సోదాలు...
మరోవైపు సిరాజ్, సమీర్ లు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్ లో ఒక బృందం సోదాలు నిర్వహించింది. సమీర్ తో సిగ్నల్ యాప్ లో టచ్ లో ఉన్న వ్యక్తి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఎన్ఐఏ అధికారుల సోదాలు నిర్వహించారు. సిరాజ్, సమీర్‌కు టచ్‌లో ఉన్నవారి ఇళ్లలో తనిఖీలు చేసి అక్కడ కీలకమైన ఆధారాల కోసం వెతికారు. సమీర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తి ఇంట్లో కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరితో టచ్ లో ఉన్న వారు ఎవరు? వీరి వెనక ఉండి నడిపించింది ఎవరన్న దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకా ఎందరు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారన్న దానిపై కూడా ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News