Sheetal : శీతల్ ను చంపిందెవరు? మిస్టరీ వీడనుందా?

మూడు రోజుల క్రితం హర్యానాలో మిస్ అయిన మోడల్ శీతల్ మరణించింది.

Update: 2025-06-17 02:06 GMT

మూడు రోజుల క్రితం హర్యానాలో మిస్ అయిన మోడల్ శీతల్ మరణించింది. ఆమె మృతదేహం సోనిపట్ కాలువకు సమీపంలో కనిపించింది. హర్యానాకు చెందిన మోడల్ శీతల్ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జూన్ 14వ తేదీన మోడల్ శీతల్ అదృశ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక చోట్ల వెతికారు. బృందాలుగా విడిపోయి శీతల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఫోన్ నెంబరు ఆధారంగా ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు.

కాలవలో పడేసి...
అయితే శీతల్ మృతదేహం సోనిపట్ లోని కాలువలో లభించింది. కాలవలో యువతి మృతదేహం ఉందని స్థానికులు సోనిపట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని కాలవ నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా చేశారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే గుర్తుల ఆధారంగా ఆ మృతదేహం హర్యానాకు చెందిన మోడల్ శీతల్ ది గా గుర్తించారు. అయితే శీతల్ ను ఎవరో గొంతుకోసి చంపినట్లు గా పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది.
మెడపై గాయాలు..
హర్యానాలో మోడల్ శీతల్ అందరికీపరిచయమే. ఆమె ఫోన్ లో ఎవరెవరెతో చివరిగా మాట్లాడిందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెకు ఎవరైనా శత్రువులున్నారా? మరేదైనా కారణమా? లేక కక్ష్యపూరితంగానే చంపేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మెడపై గాయలు ఉండటంతో పాటు కత్తిపోట్లు కూడా ఉండటంతో ఆమెను చంపిందెవరు? అన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. మృతదేహాన్ని సివిల్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
Tags:    

Similar News