విజయవాడలో విషాదం.. ఇంట్లో ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి మృతురాలి మొబైల్ ను, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
MBA student pratyusha suicide
విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎంబీఏ విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణలంకలోని రణదివేనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఖంగుతిన్నారు. మృతురాలిని ప్రత్యూష(22)గా గుర్తించారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ప్రత్యూష (22) ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి మృతురాలి మొబైల్ ను, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా.. ప్రత్యూష ఎందుకింత దారుణానికి పాల్పడిందన్న విషయంపై కుటుంబ సభ్యుల్లోనూ సందిగ్ధత నెలకొంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు. కన్న కూతురు ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో ప్రత్యూష తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.