జార్ఖండ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి
జార్ఖండ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.
జార్ఖండ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు, హతమయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ ఉదయం గోయిల్కెర పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్జువా కొండ వద్ద జరిగిందని పోలీసులు తెలిపారు.
కాల్పులు ముగిసిన తర్వాత...
పీటీఐ తో మాట్లాడిన కొల్హాన్ డీఐజీ అనురంజన్ కిస్పొట్టా మాట్లాడుతూ "ఉదయం తొలిగంటల్లో మావోయిస్టులు మరియు భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. అనంతరం గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది," అని ఆయన తెలిపారు.ప్రస్తుతం ఒక మావోయిస్టు మృతి చెందాడని ఆయన తెలిపారు.