ఫార్చూనర్ కారును బెదిరించి లాక్కెళ్లిపోయారు.. వీడియో మొత్తం రికార్డు

Update: 2022-10-31 02:02 GMT

మీరు మీ కారు నుండి దిగగానే ఓ వ్యక్తి మీపై తుపాకీని గురిపెట్టి కారును లాక్కొని వెళితే ఎలా ఉంటుందో తెలుసా..? ఇలాంటి ఘటనలన్నీ సినిమాల్లో మనం చాలానే చూశాం. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా ఇలాంటి ఘటన ఒక చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారు నుండి కిందకు దిగగానే బెదిరింపులకు దిగి కారును లాక్కుని వెళ్లిపోయారు. ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని దొంగతనం చేశారు.

ఢిల్లీ కంటోన్మెంట్ సమీపంలోని జాతీయ రహదారి-8పై బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి టయోటా ఫార్చ్యూనర్‌ను దోచుకున్నారని పోలీసులు ఆదివారం తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన సమీపంలోని సీసీటీవీల్లో రికార్డయింది. సాయుధ దుండగులు పిస్టల్‌ను చూపించి ఫార్చ్యూనర్ కారును బహిరంగంగా దోచుకుని పారిపోతున్నట్లు ఫుటేజ్ చూపిస్తుంది, అక్కడ ఉన్న మిగిలిన వ్యక్తులు ఏ మాత్రం ఎదురుతిరగలేదు.
వీడియోలో, ముగ్గురు వ్యక్తులు బైక్ నడుపుతూ కనిపించారు. SUV రోడ్డుపై ఆగినప్పుడు, ముగ్గురిలో ఒకరు డ్రైవర్ వైపుకు వచ్చారు. డ్రైవరు బయటకు రాగానే, ఓ వ్యక్తి జేబులోంచి పిస్టల్ తీసి బెదిరించాడు. మరో నిందితుడు కూడా చేరి పిస్టల్‌తో బెదిరించాడు. మూడవ నిందితుడు ఆఖర్లో వారితో చేరి.. ముగ్గురూ బైక్‌ను వదిలి SUVలో అక్కడి నుండి పారిపోతారు.
సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. "ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి తుపాకీలు చూపించి తన టొయోటా ఫార్చ్యూనర్‌ను దోచుకున్నారని ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలోని బాదం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రాహుల్ అనే ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపాడు" అని అన్నారు. పోలీసు బృందాల వద్ద నిందితుల ఛాయాచిత్రాలు ఉన్నాయి. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. పోలీసు బృందాలు వాహనాన్ని, ఆ వాహనం ఎక్కడికి వెళ్లిందో గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని అధికారి తెలిపారు.



Similar News