30 ఏళ్ల సర్వీసులో ఉపాధ్యాయుడి కీచక క్రీడలు.. 60 మంది విద్యార్థినులను..

రిటైర్ అయ్యాక శశికుమార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో స్కూల్లో ఉన్న విద్యార్థినులను

Update: 2022-05-14 10:33 GMT

కేరళ : పాఠాలు చెప్పి.. విద్యార్థులకు సరైన దారి చూపాల్సిన ఆ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తన కామకోరికలను తీర్చుకునేందుకు 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. ఈ విషయం ఆ ఉపాధ్యాయుడు రిటైర్ అయ్యాక వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని మలప్పురం మున్సిపాలిటీలో ప్రస్తుతం సీపీఎం కౌన్సిలర్ గా ఉన్న కేవీ శశికుమార్.. సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి 2022, మార్చి 31న పదవీ విరమణ పొందాడు.

రిటైర్ అయ్యాక శశికుమార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో స్కూల్లో ఉన్న విద్యార్థినులను లైంగికంగా వేధించాడంటూ.. 75 మందికి పైగా శశికుమార్ పై ఫిర్యాదు చేశారు. కానీ.. మూడుసార్లు కౌన్సిలర్ గా ఉన్న అతను.. తన రాజకీయపలుబడి ఉపయోగించాడు. దాంతో.. అతను చేసిన దారుణాలపై ఎవరూ నోరువిప్పలేదు. శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న మాజీ విద్యార్థిని ఒకరు అతడి లీలలను బయటపెట్టింది. దాంతో శశికుమార్ కనిపించకుండా పోయాడు.
ఆఖరికి అతడిని మే13, శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ చేయాలని కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ఆదేశాలు జారీ చేశారు. అలాగే 30 ఏళ్లపాటు విద్యార్థినులను వేధించిన ఆ స్కూల్లో యాజమాన్య లోపాలేమైనా ఉన్నాయేమో చూడాలని సూచించారు. శశికుమార్ పై లైంగిక ఆరోపణలు రావడం, అరెస్ట్ ఘటనలతో సీపీఎం అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. శశికుమార్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.


Tags:    

Similar News