Breaking : హైదరాబాద్ లో కన్నడ నటి మృతి

హైదరాబాద్ లో కన్నడ నటి శోభిత బలవన్మరణానికి పాల్పడ్డారు. గచ్చిబౌలిలోని ఆమె తన నివాసంలో మరణించి ఉన్నారు.

Update: 2024-12-01 13:37 GMT

హైదరాబాద్ లో కన్నడ నటి శోభిత బలవన్మరణానికి పాల్పడ్డారు. గచ్చిబౌలిలోని ఆమె తన నివాసంలో మరణించి ఉన్నారు. శోభిత పలు కన్నడ సీరియల్స్ లో నటించినట్లు చెబుతున్నారు. శోభితకు వివాహం అయిన తర్వాత సినిమాలకు, సీరియల్స్ కు దూరంగా ఉంటున్నారు. గచ్చిబౌలిలో తన భర్తతో కలిసి ఉంటున్న శోభిత ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. గత రెండేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

పలు సీరియళ్లలలో...
శోభిత మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కుటుంబ సభ్యులు కూడా మరణానికి గల కారణాలు చెప్పలేకపోతున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన శోభిత 2023 లో వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. శోభిత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చే్స్తున్నారు.


Tags:    

Similar News